ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్.. మంత్రులుగా లాలు కొడుకులు

బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణం స్వీకారం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు..పాట్నాలోని గాంధీ మైదానంలో నితీశ్ కుమార్ 5వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పదిహేనేళ్ల క్రితం కొద్దిరోజులుగా సీఎంగా పనిచేసిన నితీశ్ కుమార్ ఆతరువాత 2005లో 2010లో సీఎం అయ్యారు. 2014 లోకసభ ఎన్నికల్లో బీహార్‌లో పార్టీ దారుణ ఓటమి అనంతరం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మాంఝీ ముఖ్యమంత్రి అయ్యారు. మాంఝీని ముఖ్యమంత్రిగా తొలగించాక నితీష్ మరోసారి సీఎం అయ్యారు. ఇప్పుడు ఐదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

నితీశ్ కుమార్ తో పాటు మొత్తం 28 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో లాలు ప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ లు కూడా ఉన్నారు. ఇంకా ముగ్గురు మహిళలకు కూడా మంత్రులుగా అవకాశం దక్కింది. కాగా నితీశ్ కుమార్ ప్రమాణ స్పీకారానికి పలువురు కేంద్రమంత్రులు.. 9 మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహాకూటమిగా పోటీ చేయగా 4:4:2 అనుకున్న ప్రకారమే పదవులు పంచుకున్నట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu