బెంగళూరు బాంబు పేలుడుపై దర్యాప్తు

 

బెంగళూరులో ఆదివారం రాత్రి సంభవించిన బాంబు పేలుడులో ఒక మహిళ మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్ సమీపంలోని చర్చి వీధిలో ఈ బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడు బెంగుళూరులో సంచలనం సృష్టించింది. ఈ బాంబు పేలుడు సంఘటన మీద జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విచారణ చేయనుంది. ఈ ఘటన మీద కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం నాడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కాగా దేశవ్యాప్తంగా వున్న ప్రధాన నగరాలలో తీవ్రవాద దాడులు జరిగే ప్రమాదం వుందన్న ఇంటెలిజెన్స్ వర్గాల ముందస్తు హెచ్చరికలున్న నేపథ్యంలో అన్ని ప్రధాన నగరాలలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన ఈ పేలుడు సంచలనం సృష్టించింది. బెంగళూరు పేలుడు వెనుక తీవ్రవాదుల హస్తం వుందా లేక మరే ఇతర కారణాల వల్ల జరిగిందా అనే అంశాన్ని ఎన్ఐఎ నిగ్గు తేల్చాల్చి వుంది.