మన్యంలో బాక్సైట్ తవ్వకాలను గవర్నర్ నిలుపుదల చేయాలి
posted on Oct 15, 2012 1:31PM
.png)
బాక్సైట్ అనుమతులను రద్దు చేయక పోవడం రాజ్యాంగ విరుద్దమని కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ అన్నారు. విశాఖమన్యంలో గిరిజనులకు వ్యతిరేకంగా, పర్యావరణానికి విద్వంసం కలిగిస్తూ జరిపే బాక్సైట్ తవ్వకాల అనుమతులను నిలుపు చేయాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు అమలు చేయక పోతే రాజ్యాంగ విరుద్దమని కేంద్ర గిరిజన, పంచయతీ రాజ్ శాఖ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ అన్నారు. గిరిజనుల హక్కులను కాపాడవలసిన భాద్యత ఆయా రాష్ట్రాల గవర్నర్లపై వుంటుందని ఆయనన అన్నారు. కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ తరహా ఉత్తర్యులను ఇచ్చిన ధాఖలాలే లేవని అన్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల అనుమతులను రద్దు చేయాలని ఆరునెలల క్రిందటే రాష్ట్రగవర్నర్ కు లేఖరాసినా స్పందించలేదన్నారు.