పాక్ కు బాంబు పేల్చిన అమెరికా.. వారిని శిక్షించాల్సిందే..


ఈ మధ్య పాక్ కు ఎదురుదెబ్బలు తగులుతున్నట్టే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ దేశానికి మద్దతుగా ఉన్న చైనా పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి కారణం పాకిస్థానీయులే అని తేల్చి చెప్పగా.. ఇప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా కూడా పాక్ పై ఓ బాంబు పేల్చింది. పఠాన్ కోట్ పై జరిగిన దాడి సూత్రధారులను శిక్షించాల్సిందే అని ఓ ప్రకటన చేసింది. అంతేకాదు పాక్ భూభాగం మీద కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థలతో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠా ‘డీ కంపెనీ’ పేరును కూడా ఆ ప్రకటన ప్రస్తావించింది. పఠాన్ కోట్ దాడి సూత్రధారులతో పాటు 2008 ముంబై పేలుళ్ల కేసుకు సంబంధించిన నిందితులను కూడా పాక్ శిక్షించాల్సిందేనని ఆ ప్రకటన డిమాండ్ చేసింది.

 

కాగా భారత ప్రధాని మోడీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ, ఒబామాతో భేటీ అయ్యారు. ఆ తరువాత ఒబామా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.