పోలీసుల అదుపులో బురిడి బాబా డ్రైవర్..


బంజారాహిల్స్ లో పూజలు పేరుతో రూ 1.33 కోట్లతో శివ అనే దొంగ బాబా పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ బురిడి బాబా కేసులో  పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అతని కారు డ్రైవర్ షాజ‌హాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కారు డ్రైవర్ ను ప్రశ్నిస్తున్నారు. దొంగ బాబాతో మ‌రో ముగ్గురు మాట్లాడిన‌ట్లు షాజ‌హాన్ పోలీసుల‌కి తెలిపాడు. బాబా క‌ర్ణాట‌క వైపుగా పారిపోయిన‌ట్లు అనుమానిస్తోన్న పోలీసులు బెంగ‌ళూరుకి ప్ర‌త్యేక గాలింపు బృందాలను పంపించారు.

 

ఇదిలా ఉండగా అలిపిరిలో రెండేళ్ల క్రితం ఇదే తరహాలో దొంగబాబా శివ మోసం చేసినట్టు తెలుస్తోంది. అప్పుడు శివను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అలిపిరి పోలీసులు నుండి  హైదరాబాద్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News