హిందూపురం వెనుకంజలో బాలయ్య

 

 

 

దేశవ్యాప్తంగా ఓట్ల కౌంటింగ్ పండుగ అంగరంగ వైభవంగా మొదలైంది. హిందూపురంలో ఓట్ల కౌంటింగ్ మొదలైన దగ్గర నుంచి ఆధిక్యం ప్రదర్శించిన నందమూరి బాలకృష్ణ ఆ తరువాత పరిస్థితి సడన్ గా మారడంతో వెనుకంజలోకి వెళ్ళిపోయారు. నందమూరి వంశానికి కంచుకోటగా వున్న హిందూపురంలో బాలయ్య భారీ ఆధిక్యం సాధిస్తాడని అభిమానులు ఆశతో వున్నారు. కాని బాలయ్య సడన్ గా వేనుకంజలోకి వెళ్ళడంతో వారు కాస్త కలవరానికి గురి అవుతున్నారు.