నిమ్మకూరులో సందడి చేసిన బాలకృష్ణ

 

 

balakrishna chandrababu, balakrishna padayatra, balakrishan tdp, nara lokesh balakrishna

 

 

కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో ప్రముఖ సినీ నటుడు,నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రలో పాల్గొనేందుకు ఆదివారం కొమరవోలు చేరుకున్నారు. తన తల్లి బసవతారకం స్వగ్రామమైన కొమరవోలులో మేనమామ కొడుకు పొట్లూరి కృష్ణాప్రసాద్ ఇంటికివెళ్ళారు. సమీప బంధువులు యోగ క్షేమాలు తెలుసుకొని, వారితో సరదాగా కాసేపు గడిపారు. బాలయ్య వెళ్ళిన కొద్దిసేపటికే నారా లోకేష్ కూడా అక్కడికి చేరుకున్నారు. అందరి బంధువులతో కలిసి సరదాగా ముచ్చటించారు. ఈ విషయం తెలిసి కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.


పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన బాలయ్య బంధువులు, గ్రామపెద్దలు, పార్టీ నాయకులు ఆహ్వానించి తేనేటి విందు ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామంలోని పాఠశాల, కళాశాల విద్యార్ధులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచి ఉన్నత చదువులు చదువుకోవాలని విద్యార్ధులకు సూచించారు. బాలయ్య రాకతో నిమ్మకూరులో పండగ వాతావరణం నెలకొంది.