బాలకృష్ణ నోట పరిటాల రవి మాట...అందరి ఆట కట్టించాడు..


ఏపీ రాజకీయాల్లో మరోసారి పరిటాల రవి పేరు తెరపైకి వచ్చింది. ఈసారి ఈయన గురించి మాట్లాడింది ఎవరో కాదు టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే  బాలకృష్ణ. రాజకీయాల్లో పరిటాల రవి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన కొద్దిరోజుల్లోనే.. ఆయన పిలుపు మేరకు పార్టీలో చేరి.. ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ర‌వీంద్ర పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1994, 1999, 2004లో వ‌రుస‌గా గెలిచి అక్క‌డ సంచ‌ల‌నం క్రియేట్ చేశారు. అందుకే పరిటాల రవి చనిపోయి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా.. అనంతపురం జిల్లాలో మాత్రం ఆయన్ని ఎవరూ మరిచిపోలేదు.

 

ఇప్పుడు బాలకృష్ణ మరోసారి పరిటాల రవిని గుర్తు చేశారు. అనంతపురం పర్యటన చేసిన బాలకృష్ణ... పెనుగొండలోని మడకశిర కూడలి వద్ద ఏర్పాటుచేసిన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఎన్టీ రామారావు విగ్రహాన్ని నేనే ఆవిష్కరించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు.  బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. నాడు అరాచక శక్తులకు అడ్డాగా ఉన్న పెనుగొండలో నేడు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు. ఇంకా పరిటాల రవి గురించి మాట్లాడుతూ.. ఆనాడు పెనుగొండ ప్రాంతంలో అరాచక శక్తులు రాజ్యం ఏలుతున్న సమయంలో పరిటాల రవీంద్ర అన్న, అందరి ఆట కట్టించారని, బాలకృష్ణ అన్నారు.

 

అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.. తెలుగు గంగ, హంద్రీనీవా సుజల స్రవంతి పథకాల ద్వారా రాయలసీమకు నీరందించాలని ఆనాడే ఎన్టీఆర్ కలలుగన్నారని.. చంద్రబాబు ఎన్టీఆర్ కలలను నిజం చేశారని తెలిపారు. దీనికి తోడు కియా, బెల్ నాసన్ తదితర పరిశ్రమలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి, ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడుతున్నారని చెప్పారు.