ఓడిన పాక్... సెమీస్‌లో భారత ప్రత్యర్థి ఆస్ట్రేలియా

 

ప్రపంచ కప్ క్రికెట్ సెమీ ఫైనల్లో భారత జట్టుతో పోటీపడబోయే జట్టు ఆస్ట్రేలియా అని తేలిపోయింది. శుక్రవారం అడిలైడ్‌లో ఆస్ట్రేలియా - పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దాంతో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టుతో ఆస్ట్రేలియా సెమీ ఫైనల్లో తలపడనుంది. ఆస్ట్రేలియా - పాకిస్థాన్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పాకిస్థాన్ మీద 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 213 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు మొదట్లోనే మూడు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత నిలదొక్కుకుని జాగ్రత్తగా ఆడుతూ స్కోరును పెంచింది. చివరకు 4 వికెట్లు కోల్పోయి 33.5 ఓవర్ల వద్ద లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో పాకిస్థాన్ ఇంటికి... ఆస్ట్రేలియా సెమీ ఫైనల్స్‌కి చేరుకున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu