చేతులెత్తేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్..151 ఆలౌట్

వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 151 పరుగులకే కుప్పకూలింది. హాడిన్ మినహా మిగతా బ్యాట్స్ మెన్ లు చేతులెత్తేయడంతో తక్కువ స్కోరుకే ఆసీస్ పరిమితమైంది. 30 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా, కాస్త కుదురుకున్నట్లే కన్పించింది. కానీ 80 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. అప్పుడు మొదలైన వికెట్ల పతనం కొనసాగుతూనే వుంది. చివరికి 151 పరుగులకు అన్ని వికెట్లూ సమర్పించేసుకుంది ఆస్ట్రేలియా.కివీస్‌ బౌలర్లలో బోల్ట్‌ 5 వికెట్లు తీస్తే, చెరో రెండు వికెట్లు నేలకూల్చారు సౌతీ, వెటోరీ, ఒక వికెట్‌ కోరె అండర్సన్‌కి దక్కింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ బ్యాట్స్‌మన్‌, ఆసీస్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. 3 ఓవర్లకే 39 పరుగులు చేసింది కివీస్‌. అద్భుతాలు జరిగితే తప్ప, ఆసీస్‌పై కివీస్‌ గెలవడం పక్కా.