ఏపీకి తొలి ఐమాక్స్ విశాఖలో.. ముందుకొచ్చిన లులు

జగన్ పాలనలో ఐదేళ్ల పాటు అభివృద్ధి అన్న మాటే వినిపించని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ఐదేళ్ల అరాచకపాలన నుంచి విముక్తి చెందిన ఆంధ్రప్రదేశ్ ఇప్పడు పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. రాష్ట్రంలో  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి.

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు అధికార పగ్గాలు చేపట్టారు. ఆయన ప్రతి అడుగూ రాష్ట్ర అభివృద్ధి దిశగానే సాగుతోంది. చంద్రబాబు రాష్ట్ర ప్రగతి కోసం చాలా క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటోంది. వివిధ పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. జగన్ ఐదేళ్ల అరాచకపాలనలో  రాష్ట్రం వదిలి వెళ్లిపోయిన ఒక్కో పరిశ్రమా తిరిగి ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తున్నది.

అందులో భాగంగానే ప్రసిద్ధ లులు గ్రూప్  రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధాన నగరాలలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఆ గ్రూప్ చైర్మన్  యుసుఫ్ అలీ చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంపై చర్చించారు.  ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. లులు గ్రూప్ తన వ్యాపార విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ను ఎన్నుకోవడాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు.  లులు గ్రూప్ ఎండీ యుసుఫాలీలో అమరావతిలో జరిగిన చర్చల్లో   విశాఖపట్నంలో 8 స్క్రీ న్ల ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ సహా అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ నిర్మిం లులూ గ్రూప్ ఛైర్మన్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా  విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్లను కూడా లులూ గ్రూప్ ఏర్పాటు చేయ నున్నది. ఇలా ఉండగా తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అమరావతిలో శనివారం (సెప్టెంబర్ 28) భేటీ అయినట్లు పేర్కొన్న లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా  తమకు సాదర స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియ జేశారు. చంద్రబాబుతో తనకు ఉన్న 18 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని పేర్కొన్నారు. మల్టీప్లెక్స్ లు, షాపింగ్ మాల్స్, హైపర్ మార్కెట్లతో పాటు రాష్ట్రంలో ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ ల్యాబ్ లను కూడా ప్రారంభించ నున్నట్లు లులు ఎండీ తెలిపారు.    

Online Jyotish
Tone Academy
KidsOne Telugu