రాష్ట్ర విడిపోయినప్పుడు కలాం ఏమన్నారంటే

 

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలాంతో తనకు 25 ఏళ్లు నుండి అనుబంధం ఉందని.. తనను ఎప్పుడూ గురువుగానే భావించేవాడినని తెలిపారు. ఎప్పుడు కలిసినా ప్రజల గురించి ప్రజల సమస్యల గురించే మాట్లాడేవారని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 'జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సింది రెండు రాష్ట్రాల అభివృద్ధి. అనుభవం కలిగిన నీవు రెండు రాష్ట్రాలను ఆ దిశగా తీసుకెళ్లు' అని కలాం తనకు చెప్పినట్లు నరసింహాన్ తెలిపారు.