సభ నుండి బయటకు రామన్న టీడీపీ...మార్షల్స్‌ను పిలిపించిన సిబ్బంది

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు విపక్ష నేతలు కూడా మద్దతిచ్చి... పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాలు మానవహారం చేపట్టాయి. రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయం నుంచి ప్రధాని కార్యాలయం వరకు ఈ కార్యక్రమం చేశారు. ఇక ఆతరువాత సభను ప్రారంభించినా ఎప్పటిలాగే... ఆందోళనలు చేస్తున్నారంటూ వంకలు చెప్పి సభను వాయిదా వేశారు. దీంతో టీడీపీ సభ్యులు సభలోనే కూర్చొని నిరసన తెలుపుతున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లేది లేదని టీడీపీ సభ్యులు తేల్చి చెబుతున్నారు. దీనిలో భాగంగా రాజ్యసభ సిబ్బందికి, సభ్యులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చేసేది లేక సిబ్బంది మార్షల్స్‌ను పిలిపించి... టీడీపీ సభ్యులను బయటకు పంపేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu