నాలుగు లారీల్లో వెలగపూడికి పైళ్లు..
posted on Sep 28, 2016 10:17AM

అక్టోబర్ 3 వరకూ హైదరాబాద్ నుండి ఉద్యోగులు ఏపీ రాజధాని అమరావతికి వచ్చేయాలని అక్కడి నుండే పాలన సాగించాలని ఆదేశాలు జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు శాఖలకు సంబంధించిన ఫైళ్లు అమరావతికి చేరుకోగా... ఇప్పుడు మరికొన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లను రాజధానికి తరలించారు. మంగళవారం ఆర్థిక శాఖకు చెందిన ఫైళ్లు, కంప్యూటర్లను నాలుగు లారీల్లో హైదరాబాద్ నుంచి వెలగపూడికి తరలించారు. మరోవైపు సచివాలయంలోని రెండో బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న ఆర్థిక పరిపాలన చాంబర్‌లోని ఫైళ్లను కూడా సర్దుతున్నారు. మరో రెండు రోజుల్లో ప్రణాళిక శాఖ ఫైళ్లు కూడా హైదరాబాద్ నుంచి వెలగపూడికి చేరతాయి. మున్సిపల్, హౌసింగ్, ఫైనాన్స్, ప్లానింగ్ శాఖలు ఇప్పటికే కొన్ని ఫైళ్లను స్కానింగ్ చేయగా, మిగిలి ఉన్నవాటిని ప్యాక్ చేసి తరలించడానికి సిద్ధం చేశారు.