ఏపీ లిక్కర్‌ కేసులో నిందితుల రిమాండ్‌ పొడిగింపు

 

ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు ఈ నెల 26 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ విజయవాడ  ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేటితో వారి రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో నిందితులను సిట్‌ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. మరింత విచారణ జరపాల్సి ఉందని అధికారులు కోరడంతో నిందితులకు న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రాజ్‌ కెసిరెడ్డి, చాణక్య, దిలీప్‌, సజ్జల శ్రీధర్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ .. గుంటూరు జిల్లా కారాగారంలో నవీన్‌ కృష్ణ, బాలాజీకుమార్‌ యాదవ్‌ రిమాండ్‌లో ఉన్నారు.

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో మిథున్‌రెడ్డి జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎంపీ మిథున్‌రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ముగియటంతో మిథున్‌రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు. మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు ఏబీసీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu