పంచ్ ప్ర‌భాక‌ర్‌ను ప‌ట్టుకుంటారా? లేదా? హైకోర్టు సీరియస్ వార్నింగ్‌..

వ‌ద‌ల ప్ర‌భాక‌ర్ నిన్నొద‌ల అంటూ హైకోర్టు స్ట్రాంగ్ పంచ్ ఇచ్చింది. మ‌రి, నోటికొచ్చిన‌ట్టు వాగితే ఊరుకుంటుందా?  టీడీపీపై, చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేసిన‌ట్టు హైకోర్టు జ‌డ్జిల‌పై ఇష్టం వ‌చ్చిన‌ట్టు కామెంట్లు చేస్తే స‌హిస్తుందా?  తాను దేశంలో లేన‌ని.. విదేశాల్లో దాగున్నాన‌నే బ‌లుపుతో.. బ‌రితెగించి యూట్యూబ్ వీడియోలు చేస్తే.. ఆ పాపం ఏనాటికైనా పండ‌క‌పోదు. అందుకే, ఇప్పుడిలా హైకోర్టు రూపంలో పంచ్ ప్ర‌భాక‌ర్ మెడ‌కు ఉచ్చు బిగుస్తోంది. ప్ర‌భుత్వం ఎంత‌గా ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. పోలీసులు-సీబీఐ ఎలాంటి కుంటి సాకులు చెబుతున్నా.. హైకోర్టు మాత్రం పంచ్ ప్ర‌భాక‌ర్ విష‌యంలో త‌గ్గేదేలే అంటోంది. ప్ర‌భాక‌ర్‌ను ప‌ట్టుకొచ్చి.. కోర్టు బోనులో నిల‌బెట్టాల్సిందే అని ప‌దే ప‌దే ఆదేశిస్తోంది. 

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రిజిస్ట్రార్‌ జనరల్‌ నుంచి లేఖ వచ్చిన వెంటనే పంచ్‌ ప్రభాకర్‌ పోస్టులను యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ తొలగించాయని, అలాగే అకౌంట్‌ని బ్లాక్‌ చేశారని స్టాండింగ్‌ కౌన్సిల్‌ అశ్వినీకుమార్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై తాము కూడా లేఖ రాసినట్టు సీబీఐ తెలిపింది. 

వారి వివ‌ర‌ణ‌పై స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. లేఖ రాసి ఉపయోగం ఏంటని ప్రశ్నించింది. పంచ్‌ ప్రభాకర్‌ని ఎలా పట్టుకుంటున్నారో చెప్పాలని కోరింది. దీనిపై సీబీఐ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు చెప్పింది వినకపోతే మీరు చెప్పేది వినాల్సిన అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం హెచ్చ‌రించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ ఏం చేయాలో తామే ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తామని తేల్చిచెప్పింది హైకోర్టు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu