ఏపీ: విరాళాలకు 100 శాతం పన్ను మినహాయింపు

కరోనా మహమ్మారిపై పోరాటానికి చేయూతనిచ్చే వారికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చే విరాళాలపై 100 శాతం పన్ను మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. 1961 ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80జీ కింద మినహాయింపు వర్తిస్తుందని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి వి. ఉషారాణి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెక్ ద్వారా విరాళాలు ఇవ్వాలనుకునే వారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, ఆంధ్రప్రదేశ్ పేరుపై పంపాలని సూచించారు.

బ్యాంక్ ద్వారా పంపే వారు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అకౌంట్ నెంబర్: 38588079208

వెలగపూడి, సెక్రటేరియట్ బ్రాంచ్

IFSC కోడ్: SBIN001884

ఆంధ్రా బాంక్, అకౌంట్ నెంబర్: 110310100029039

వెలగపూడి, సెక్రటేరియట్ బ్రాంచ్, IFSC CODE: ANDB0003079