గోదావరికి వరద.. పాపికొండల యాత్రకు బ్రేక్!

ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరుగుతున్నది. ముఖ్యంగా ధవళేశ్వరం, భద్రచలం వద్ద గోదావరి వరద ఉధృతి కనిపిస్తోంది. ఈ కారణంగా  పాపికొండల యాత్ర నిలిచిపోయింది. గోదావరిలో నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పాపికొండలు విహార యాత్రను నిలిపివేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వరకూ పాపికొండల మీదుగా విహారయాత్రకు పర్యటకులు మక్కువ చూపుతారు. ప్రకృతి రమణీయతను ఆస్వాదీస్తూ శ్రీరామచంద్రుల వారి దర్శనం చేసుకోవడం ఒక మధురానుభూతిగా భావిస్తారు. అయితే గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఈ యాత్రను నలిపివేసింది. ఈ యాత్ర మళ్లీ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందన్న విషయాన్ని తెలియజేయలేదు. యాత్ర పున: ప్రారంభం ఎప్పటి నుంచి అన్నది తరువాత ప్రకటిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ పేర్కొంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu