ఏపీ పూర్తి స్థాయి డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా నియమకం

 

ప్రస్తుత ఇన్‌చార్జి డీజీపీగా కొన‌సాగుతున్న హరీశ్‌కుమార్ గుప్తాను పూర్తిస్థాయిలో ఏపీ పోలీస్ బాస్‌గా నియమిస్తూ కూటమి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. నేటీ నుంచి రెండేళ్ల పాటు ఆయన డీజీపీగా కొనసాగనున్నారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో హరీశ్‌కుమార్ గుప్తాను ప్ర‌భుత్వం ఇన్‌చార్జి డీజీపీగా నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ప‌నితీరు సంతృప్తిక‌రంగా ఉండ‌డంతో ఆయ‌న‌నే పూర్తిస్థాయి డీజీపీగా నియ‌మించాల‌ని ప్ర‌భుత్వం  నిర్ణ‌యించింది. 

రిటైర్‌మెంట్ వ‌య‌సుతో సంబంధం లేకుండా రెండేళ్లపాటు హరీశ్‌కుమార్ గుప్తా ఈ ప‌ద‌విలో కొన‌సాగుతారు.  నూతన పూర్తి స్థాయి డీజీపీగా ఎంపికైన ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. జమ్మూకశ్మీరుకు చెందిన ఆయన.. న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. 1993 డిసెంబరులో ఖమ్మం ఏఎస్పీగా తొలుత విధుల్లో చేరారు. తర్వాత మెదక్‌, పెద్దపల్లి ఏఎస్పీగా పనిచేశారు. కరీంనగర్‌, నల్లగొండ జిల్లాల అదపు ఎస్పీగా.. అనంతరం కృష్ణా, నల్లగొండ జిల్లాల ఎస్పీగా విధులు నిర్వహించారు. సమర్థ అధికారిగా పేరుతెచ్చుకున్న ఆయన.. గుంటూరు రేంజ్‌ ఐజీ, శాంతిభద్రతల ఐజీగానూ పనిచేశారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu