ఏపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ నియామకం

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి సారించింది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైన సరే ఎక్కువ సీట్లు  గెలుచుకోవాలని అస్త్రాలను సిద్దం చేస్తోంది. సమస్యలపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ముందుగా పార్టీ నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలని రాష్ట్ర నేతలను ఆదేశించింది. తొలుత పార్టీలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయాలని నిర్ణయించింది. 

మాణిక్కం ఠాగూర్ ఛైర్మన్‌గా 25 మంది సభ్యులతో  ఏపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ఏఐసీసీ నియామించింది. ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా జేడీ శీలం మస్తాన్ వలీ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ జననల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu