మళ్లీ సింగపూర్ వెళ్లిన చంద్రబాబు
posted on Sep 20, 2015 2:02PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సింగపూర్ వెళ్లారు. అక్టోబర్ 22న విజయదశమినాడు జరగనున్న నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు సింగపూర్ ప్రధాని లీ శాన్ లూంగ్‌ను స్వయంగా ఆహ్వానించనున్న చంద్రబాబు, ఏపీ రాజధానికి సంబంధించి స్విస్ ఛాలెంజ్ విధానం, భవనాల ఆర్కిటెక్చర్ పైనా చర్చించనున్నారు. ఇవేకాకుండా రాజధాని నిర్మాణం, మాస్టర్ ప్లాన్‌లో మార్పులుచేర్పులపైనా మాట్లాడనున్నారు. బాబుతోపాటు సింగపూర్ వెళ్లినవారిలో మంత్రులు యనమల, నారాయణ, మీడియా సలహాదారు పరకాల, పలువురు నియర్ ఐఏఎస్ లు ఉన్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా రేపు సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్‌తో సమావేశంకానున్న బాబు, ఆ తర్వాత సౌత్ ఏషియన్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్‌లో కీలకోపన్యాసం చేయనున్నారు. మంగళవారం సింగపూర్ సిటీ గ్యాలరీని, మూడు టౌన్ షిప్‌లను బాబు బృందం సందర్శించనుంది.