అది కరెక్ట్ కాదు.. చంద్రబాబుకి సింగపూర్ టీమ్ హెచ్చరిక

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణాన్ని రూపొందించే బాధ్యతను ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రతినిధులకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యమైన సింగపూర్ ప్రభుత్వం సీఎం చంద్రబాబుకు కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అదేంటంటే..  రాజధాని నిర్మాణంలో భాగంగా చంద్రబాబు కొన్ని ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి అర్బన్ రీజియన్ డెవలప్ మెంట్ రద్దుచేస్తూ ఏపీ కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ (సీఆర్ డీఏ) పేరుతో ప్రైవైట్ సంస్థలకు వాటి బాధ్యతలు అప్పగించారు. దీనిలో కూడా సరైన సిబ్బంది లేరు. రాజధాని నిర్మాణం.. పరిసర ప్రాంతాల సుందరీకరణ త్వరలో జరగబోయే రాజధాని శంఖుస్థాపన కోసం దాదాపు 30 మంది కన్సల్ టెంట్ లను నియమించారు. ఈనేపథ్యంలోనే సింగపూర్ బృందం తమ అభ్యంతరాలను సీఎం ముందు వ్యక్తపరిచినట్టు తెలుస్తోంది. రాజధాని నిర్మాణం అనేది చాలా జాగ్రత్తగా జరగాల్సిన ప్రక్రియ అని.. ఎంతో కీలకమైన రహస్యం ఉంటుందని.. కాబట్టి ప్రభుత్వ సిబ్బంది లేకుండా ప్రైవేటు వ్యక్తుల ద్వారా చేయడం సరికాదని హెచ్చరించినట్టు తెలిసింది. మరి సింగపూర్ చెప్పిన దానిపై సీఎం ఆలోచిస్తారో లేదో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu