అమరావతికి పక్కా వాస్తు.. రాజధానికి అద్భుత అవకాశం

 

ఏపీ క్యాపిటల్ అమరావతి నిర్మాణానికి వాస్తు100 శాతం బావుందని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. ఇప్పటికే ఏపీ సీడ్ క్యాపిటల్ కు సంబంధించిన ఫోటోలు విడుదలవడంతో ప్రపంచ దేశాలను తలదన్నేల ఏపీ రాజధాని ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్‌ ఏపీ సీడ్‌ క్యాపిటల్‌ ప్రణాళికను కూడా అందజేశారు. ముఖ్యంగా పర్యావరణానికి పెద్ద పీట వేసిన ఏపీ రాజధానికి అన్ని వాస్తు ప్రమాణికలు బాగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ రాజధాని నమూనాను కృష్ణానది ఆధారంగా చేసుకొని నిర్మించడం జరిగింది. ఉత్తరాన కృష్ణానది ఉండడంతో నీటి ప్రవాహం ఉత్తరం నుంచి తూర్పు ఈశాన్యం గుండా పారుతున్న క్రమంలో వాస్తు నియమాల ప్రకారం తూర్పు దిశగా అందునా ఉత్తరం నుంచి నీరు తూర్పుకు ఈశాన్యాన ఏటవాలుగా ప్రయాణించడాన్ని అత్యంత ఉత్కృష్టంగా భావిస్తారు. ఇప్పుడు ఏపీ రాజధానికి అలాంటి అద్భుత అవకాశం లభించింది. మరోవైపు దక్షిణ భాగంలో కొండ ప్రాంతం ఉండడం కూడా రాజధానికి వాస్తు పరంగా కలిసిరానుంది. ఇది పరిశ్రమలకు అనువైన స్థలంగా నిపుణులు చెపుతున్నారు. ఈ పరిశ్రమల నిర్మాణానికి కూడా వాస్తు కలిసిరావడం గమనార్హం.

 

ఒకరకంగా ఏపీ రాజధానికి ఇలా వాస్తు కలిసిరావడం ఓ రకంగా అదృష్టంగానే భావించవచ్చు. అసలు ఏపీ రాజధాని నిర్మాణానికి ఎంత సమయం పడుతుందో తెలియదుకాని రాజధాని అయిన అమరావతి మీద మాత్రం చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి అనేక సింగపూర్, జపాన్ వంటి దేశాలలో పర్యటించి అనేక పెట్టుబడిదారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు సీఎం చంద్రబాబు. ఆ పెట్టుబడి దారులందరూ అనుకున్నట్టుగానే ఏపీలో పెట్టుబడులు పెడితే నిజంగానే ఏపీ రాజధాని ప్రపంచ దేశాలను తలదన్నే రాజధాని అవుతుందనడంలో సందేహం లేదు. కానీ దానికి కొంత సమయం పడుతుండొచ్చు. కాగా ఏపీ సీడ్ క్యాపిటల్ సంబంధించి శనివారం ఫోటోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu