జులై 10 నుంచి భౌతిక దూరం పాటిస్తూ టెన్త్ పరీక్షల నిర్వహణ!

రాష్ట్రంలో జులై 10 నుంచి 15 వ‌ర‌కు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది. ఈ సారి ప్రతి సబ్జెక్టుకు ఒక్క పేపర్‌తో మాత్రమే పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 11 పరీక్షల పేపర్లను 6కి కుదించింది. జులై 10న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 11న సెకండ్‌ లాంగ్వేజ్‌, జులై 12న థర్డ్‌ లాంగ్వేజ్‌, 13న గణితం, 14 సామాన్య శాస్త్రం, 15న సాంఘీక శాస్త్రం పరీక్షలు ఉంటాయని తెలిపింది. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తామని ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది.

కరోనా వైరస్ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు 11 పేపర్ ల నుంచి ఆరు పేపర్లకు కుదించారు. ప్రతి పేపర్ కు వంద మార్కులు... టెన్త్ పరీక్షలు మారిన పరీక్షా విధానాన్ని మార్చి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భౌతిక దూరం పాటిస్తూ టెన్త్ పరీక్షలను నిర్వ‌హించ‌నున్నారు.

Time table
సమయం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు.
10 వ తేదీ తెలుగు,
11వ తేదీ హిందీ ,
12వ తేదీ ఇంగ్లీష్ ,
13వ తేదీ గణితం ,
14వ తేదీ సైన్స్ ,
15వ తేదీ సోషల్ స్టడీస్

Online Jyotish
Tone Academy
KidsOne Telugu