హిందీవాళ్లతో ఇష్టం లేదా?
posted on Sep 24, 2012 4:40PM
.jpeg)
రేఖ, శ్రీదేవి, జయప్రద ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగునుంచి హిందీకెళ్లి అక్కడ బా...గా.. కష్టపడి పైకొచ్చిన హీరోయిన్లు కోకొల్లలు. మామూలుగా తెలుగు ప్రొడ్యూసర్లు బోర్ కొట్టగానే చాలామంది హీరోయిన్లు హిందీ ప్రొడ్యూసర్లవైపు చూస్తారు. కొందరు హీరోయిన్లైతే బాలీవుడ్ నిర్మాతలు ఒక్క చూపు చూస్తే చాలు నిలువెల్లా బంగారంతో నిండిపోవచ్చని ఆశపడుతుంటారు. బాలీవుడ్ అంటే హీరోయిన్లకుండే క్రేజ్ అలాంటిది మరి. కానీ.. కోలీవుడ్ లో, టాలీవుడ్ లో మాం....చి ఊపులో ఉన్న అమ్మణ్ణి అనుష్కకి హిందీ వాసనంటే అస్సలు పడదంట. హిందీవాళ్లతో చేయడం తనకస్సలు ఇష్టంలేదని తెగేసి చెబుతోందీ అమ్మడు. తెలుగు నిర్మాతలు, కన్నడం నిర్మాతలు చూసుకున్నంత బాగా హిందీ నిర్మాతలు చూసుకోరని భయపడిందో లేక అక్కడి అవకాశాలకోసం అర్రులుచాచి ఇక్కడి అవకాశాల్ని పోగొట్టుకున్న చాలామందిని చూసి మనకెందుకులే అనుకుందోగానీ.. ఇప్పట్లో అస్సలు హిందీ వాళ్లవైపు చూసే పనేలేదని అనుష్క గట్టిగా చెప్పేసింది.