అన్నవరం ఆలయంలో సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

 

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో సుబ్బారావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మరో ఐదుగురికి షోకాజు నోటీసులు ఇచ్చారు. పారిశుద్ధ్య సిబ్బందికి చెందిన ఫీఎఫ్ చెల్లింపుల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఈవో ఈ మేరకు చర్యలు చేపట్టారు. గుంటూరుకు చెందిన కనకదుర్గ మ్యాన్ పవర్ సర్వీసెస్‌కు చెందిన పారిశుద్ధ్య సిబ్బంది ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు.

అయితే కనకదుర్గ మ్యాన్ పవర్ సర్వీసెస్‌ ఏజెన్సీ.. కార్మికుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో నగదు జమ చేయకుండానే చేసినట్లుగా నకిలీ చలాన్లను సృష్టించి ఆలయ అధికారులకు చూపించింది.  అయితే ఆ రికార్డులు పరిశీలించకుండానే ఆలయ అధికారులు ఏజెన్సీకి బిల్లులు  పంపించారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు

ఈ నేపథ్యంలోనే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఆలయ పారిశుద్ధ్య పర్యవేక్షకుడు వెంకటేశ్వర రావు, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణలపై ఈవో సస్పెన్షన్ వేటు వేశారు. అప్పటి పర్యవేక్షణ అధికారి సత్య శ్రీనివాస్‌కు ఛార్జిమెమో ఇచ్చారు. టోల్ రుసుం వసూలు చేసే గుత్తేదారు నుంచి రూ. 41 లక్షలు జీఎస్టీ వసూలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు సీ-సెక్షన్ అధికారులకు షోకాజ్ నోటీసులు పంపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu