మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డీవో అరెస్ట్
posted on Jul 8, 2025 9:00PM

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డిఓ మురళిని మంగళవారం తిరుపతి లో సిఐడి అధికారులు అరెస్టు చేశారు. సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా, మదనపల్లి కలెక్టరేట్లో.. గత ఏడాది జులై 21 రాత్రి ఫైళ్ల దగ్ధం పాఠకులకు విధితమే అన్నారు. ఈ కేసులో ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ, మాధవ రెడ్డీలను అరెస్టు చేయగా, ఇప్పుడు మాజీ ఆర్డీఓ మురళిని తిరుపతి కె ఆర్ నగర్‌లో సిఐడి అధికారులు అరెస్టు చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ తేజ్ ను ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జులై 21న అగ్ని ప్రమాదం జరిగి కీలక ఫైళ్లు దగ్దం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉన్నట్లు కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ప్రమాదం జరగడానికి ముందు అక్కడ పని చేసిన ఆర్డీవో, ఇతర అధికారులను పోలీసులు వారం రోజుల పాటు విచారించారు. ఈ క్రమంలో ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది.