ఎంసెట్ లేటయితే అంతే సంగతులు: దేవినేని ఉమ

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇంజనీరింగ్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్) ఆలస్యమైన పక్షంలో ఇక అంతే సంగతులని, రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతారని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. అలాగే 1956 నిబంధనను భౌగోళిక అంశాలకు కూడా వర్తింపజేస్తారా అని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే విద్యార్థుల స్థానికతపై నిర్ణయం తీసుకోవడానికి కెసిఆర్ ఎవరని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. లోకల్, నాన్‌లోకల్ అనే విషయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డిలో ఉందని అన్నారు. స్థానికతపై కేసీఆర్ 1956ను కటాఫ్‌గా తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. విభజన చట్టానికి అనుగుణంగా పదేళ్ల ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కేసీఆర్ సహకరించాలన్నారు.