మాకు ఇష్టమే.. పవన్ అడ్డురావద్దు

 

ఏపీ ప్రభుత్వ చేపడుతున్న భూసేకరణను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైతుల వద్ద నుండి భూములు తీసుకోవద్దని ట్విట్టర్ వేదికను చేసుకొని చంద్రబాబును కోరిన సంగతి తెలిసిందే. బేతపూడి, ఉండవల్లి, పెనుబాక భూములను భూసేకరణ నుండి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. అయితే పవన్ కు మాత్రం బేతపూడి గ్రామస్థులు షాకిచ్చారు. భూములు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని.. భూములు ఇవ్వడానికి తామంతా అనుకూలమేనని చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సహకరించకపోయినా ఫర్వాలేదు కానీ, అడ్డు మాత్రం తగలొద్దని పవన్ కళ్యాణ్‌కు సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu