ఏపీ రాజధాని భూసమీకరణ విధానం...

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు రైతుల నుంచి భూ సమీకరణకు సంబంధించిన ప్రభుత్వ విధానాన్ని రాష్ట్ర మంత్రులు గురువారం నాడు ప్రకటించారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తుళ్ళూరు మండలాలలోని 17 గ్రామాల్లో భూ సమీకరణ జరపనున్నారు. ఏపీ రాజధాని భూ సమీకరణపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం నాడు సమావేశమై చర్చలు జరిపింది. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. రైతుల నుంచి భూమిని సమీకరించి ప్రజారాజధాని నిర్మిస్తామని తెలిపారు. ప్రస్తుతం వున్న వీజీటీఎం స్థానంలో క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. మంత్రులు పేర్కొన్న మరికొన్ని ముఖ్యాంశాలు.

 

* రాజధాని నిర్మాణం కోసం గ్రామాలు, వాటిలోని ఇళ్ళ జోలికి వెళ్ళం.

 

* భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న కొద్దిమంది రైతులను ఒప్పించడానికి కృషి. వారిని ఒప్పించే భూ సమీకరణ.

 

* ప్రభుత్వ భూమి వున్న పట్టాదారులకు ప్రత్యేక విధానం అమలు.

 

* 30 వేల ఎకరాలను ఆరు సెక్టార్లుగా అభివృద్ధి చేయనున్నారు.

 

* లాటరీ విధానం ద్వారా రైతులకు అనుకూలంగా వున్న ప్రాంతంలో భూమి.

 

* రైతులకు పదేళ్ళపాటు ఎకరానికి 25 వేల రూపాయల అదనపు సాయం. ఈసాయం ఏటా ఎకరాకి 1250 పెరుగుతుంది.

 

* భూ సమీకరణలో తీసుకునే భూముల్లో అరటి, పత్తి, మిరప పండే భూములు వున్నాయి.