TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమి: ట్రంప్ విధానాల ఫలితమేనన్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.!

Published on: Fri Nov 6, 2026 11:09AM

అమెరికా  మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధికారిక రిపబ్లికన్ పార్టీకి తీవ్ర నిరాశను మిగిల్చాయి. ముఖ్యంగా సొంత పార్టీ నేతల నుంచే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురు కావడానికి కారణమయ్యాయి. మధ్యంతర ఎన్నికలలో ఘోర పరాజయానికి, అధికార రిపబ్లికన్లు  కాంగ్రెస్‌పై పట్టు కోల్పోవడానికి ఇరాన్‌తో జరిగిన యుద్ధమే ప్రధాన కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ముఖ్యంగా ఇరాన్ తో ఘర్షణ విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకున్న ట్రంప్ పై రిపబ్లికన్లే నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా ఉపాధ్యక్షుడు  జేడీ వాన్స్   డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన విధానాలపై నిప్పులు చెరిగారు. అయితే ట్రంప్ ను నేరుగా విమర్శించకుండా, పరోక్షంగా నిందించారు. మధ్యంతర ఎననికలలో ఓటమికి కారణాలను విశ్లేషిస్తూ ట్రంప్ విధానాలపై చురకలు వేశారు. 

మధ్యంతర ఎన్నికల ఫలితాల తరువాత రిపబ్లికన్ల పరాభవానికి అనలిస్టులు ఎన్నిరకాల కారణాలు చెబుతున్నా, వాస్తవాన్ని దాచడం సాధ్యం కాదంటూ జేడీ వాన్స్  రిపబ్లికన్ల వైఫల్యాలను బాహాటంగా అంగీకరించారు. అనుసరించిన విధానాలు తప్పని ఒప్పుకున్నారు.  ఇరాన్‌తో   యుద్ధం కారణంగానే రిపబ్లికన్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని జేడీ వాన్స్  సామాజిక మాధ్యమ వేదికగా కుండబద్దలు కొట్టారు. ఇరాన్ తో యుద్ధం కారణంగానే ప్రభఉత్వం   సెనేట్‌పై నియంత్రణను కోల్పోవడం సరైందేనని ఎవరైనా వాదిస్తే, వారు బహిరంగంగా ఆ నిజం ఒప్పుకోవాలని, అంతేకాని ఓటమికి వేరే సాకులు వెతకకూడదని ఆయన పరోక్షంగా ట్రంప్ కు చురకలంటించారు. 

 మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ పూర్తి ఆధిపత్యాన్ని సాధించిన సంగతి విదితమే. రిపబ్లికన్ పార్టీకి కంచుకోటలుగా  భావించే ప్రాంతాల్లోనూ ఓటర్లు డెమొక్రాట్ల వైపు మొగ్గు చూపడం రిపబ్లికన్ల ప్రతిష్ఠ, మరీ ముఖ్యంగా ట్రంప్ ప్రభ ఏంతగా మసకబారాయో తేటతెల్లం చేస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల భారం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైందని, ఇదే పార్టీ ఓటమికి దారితీసిందని జేడీ వాన్స్ నిస్సంకోచంగా అంగీకరించారు. 

ఇది కూడా చదవండి: అమెరికా మధ్యంతర ఎన్నికలు: డెమొక్రట్ల హవా.. ట్రంప్ పాలనపై ప్రజాగ్రహం.!

ఇక్కడ జేడీ వాన్స్ ఒప్పుకోలు ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుందంటే.. మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్ల ఓటమికి   భిన్నమైన స్పందన కనబరిచారు. ఇరాన్ యుద్ధం ఒక కారణం అంటూనే.. తాను తీసుకున్న నిర్ణయం సరైదేననీ, మళ్లీ అవకాశం వస్తే అదే నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఇక్కడే ట్రంప్ వైఖరికి భిన్నంగా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తప్పిదం ఘోరమైనదని అంగీకరించడం ఇరువురి మధ్యా విభేదాలను ఎత్తి చూపింది. 

గతంలో ట్రంప్-వాన్స్ జోడీని గెలిపించిన ఓటర్లు సైతం ఈ ఎన్నికల్లో తమ అసంతృప్తిని ప్రదర్శించారని అంతర్గత సర్వే డేటా ద్వారా స్పష్టమైందని వాన్స్ తెలిపారు.  పార్టీ మద్దతుదారులు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చినప్పటికీ, దౌత్య,   ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వంపై వ్యతిరేకత వారి ఓటింగ్ ధోరణిని మార్చివేసిందని జేడీ వాన్స్ పేర్కొన్నారు.  

మీకు నచ్చవచ్చు:  లాస్ ఎంజెల్స్ మేయర్: భారత సంతతి నేత నిత్యారామన్.!

మేరీ ల్యాండ్ గవర్నర్ గా రెండో సారి: తెలుగు సంతతి యువతి అరుణా మిల్లర్.!

[America Vice President JD Vance Iran War Critique, US Midterm Election Results, Trump  policy, Republican Party Defeat, Telugu One]