అంగరంగ వైభవంగా అఖిల్ జనాబ్ వివాహం

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అక్కినేనిఅఖిల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.  శుక్రవారం (జూన్ 6) తెల్లవారు జామున మూడు గంటలకు అఖిల్ జనాబ్ మెడలో తాళి కట్టారు. ఈ వివాహ వేడుకకు  మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్  సహా  టాలీవుడ్ తారలంతా కదిలి వచ్చారు.  

గురువారం (జూన్ 5) రాత్రి నుంచే వివాహ వేడుకలు ఆరంభమయ్యాయి.  వెకేషన్ లో ఉన్న అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, శోభిత దంపతులు కూడా వెకేషన్ ను ముగించుకుని వివాహానికి హాజరయ్యారు. ఇక ఆదివారం (జూన్ 8)న అఖిల్ జనాబ్ ల పెళ్లి రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్, బాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ హాజరౌతారని తెలుస్తోంది. అలాగే పలువురు రాజకీయనాయకులు, పారిశ్రామిక వేత్తలూ కూడా ఈ రిసెప్షన్ కు హాజరయ్యే అవకాశం ఉంది.  ఆదివారం (జూన్ 8) వివాహ రిసెప్షన్ ను భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు అక్కినేని ఫ్యామిలీ తెలిపింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu