ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక: విస్తృత తనిఖీలు.!
Published on: Wed Nov 11, 2026 12:08PM

ఇటీవలి కాలంలో విమానాలకు బాంబు బెదరింపులు సర్వసాధారణంగా మారిపోయాయి. ఆ బెదరింపులతో సిబ్బంది అప్రమత్తమై విమానంలో విస్తృత తనిఖీలు నిర్వహించి, ఆ బెదరింపు ఫేక్ అని నిర్దారించుకుని ఊపిరి పీల్చుకోవడం రివాజుగా మారింది.
అందుకు భిన్నంగా బుధవారం (నవంబర్ 11)న ఎయిర్ ఇండియాకు హైజాక్ బెదరింపు వచ్చింది. కోల్‌కతా నుంచి ముంబయి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం నుంచి ఈ అలర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు వచ్చింది. ఈ ఉదంతం కలకలం రేపింది. కోల్‌కతా విమానాశ్రయంలో టేకాఫ్‌కు సర్వం సిద్ధం చేసుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
విమానంలోని టాయిలెట్‌లోని ఒక అద్దంపై హైజాక్ బెదిరింపు సందేశం రాసి ఉండటాన్ని గుర్తించిన విమాన సిబ్బంది. వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులకు హైజాక్ అలర్ట్ సమాచారం అందించారు.

స్పందించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది తక్షణమే తదుపరి చర్యలు చేపట్టారు. విమానం టేకాఫ్ ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, భద్రతా చర్యల్లో భాగంగా దానిని ఎయిర్‌పోర్టులోని ప్రత్యేక ఐసోలేషన్ ప్రాంతానికి సురక్షితంగా తరలించారు.
ఇది కూడా చదవండి: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు: 109 మంది ప్రయాణీకులు సురక్షితం.!
విమానంలో సీఐఎస్‌ఎఫ్ భద్రతా సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఘటన వెనుక అసలు నిజాలు ఏంటనే కోణంలో ఏజెన్సీలు సంయుష్టంగా దర్యాప్తు జరుపుతున్నారు.

విమానం టాయిలెట్ లో అద్దం మీద బెదరింపు సందేశం రాసిన వ్యక్తులెవరు? వారికి సహకరించిన వారెవరు అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. మొత్తం మీద ఇది ఆకతాయి బెదరింపుగా అధికారులు భావిస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ‘హై అలర్ట్’.. అడుగడుగునా నిఘా..!
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం: దంపతుల అరెస్టు.!
[Air India Flight High Threat, Hijack Alert, Kolkata Airport, CISF Security Check, Telugu One]


