ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు: 109 మంది ప్రయాణీకులు సురక్షితం.!
Published on: Fri Oct 23, 2026 12:14PM

ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శుక్రవారం (అక్టోబర్ 23) బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో టేకాఫ్ అయిన ఐదు నిముషాలలోనే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమాన పైలట్ వెంటనే తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశారు.
దీంతో విమానంలో ఉన్న 109 మంది ప్రయాణీకులు సురక్షితంగా బటయపడ్డారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే గ్రౌండ్ స్టాఫ్, ఇంజనీరింగ్ విభాగం మరియు సాంకేతిక నిపుణుల బృందాలు ప్రయాణికులను సురక్షితంగా టెర్మినల్ బిల్డింగ్‌కు తరలించారు. అనంతరం ఇంజనీర్లు విమానంలోని లోపాలను పరిశీలించారు.

ఏది ఏమైనా విమాన పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ఆ విమానంలో ఉన్న 109 మంది ప్రయాణీకులు, సిబ్బంతి ప్రాణాలు నిలిచాయి. పరిస్థితిని సకాలంలో అంచనా వేసి అత్యవసర నిర్ణయం తీసుకుని ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన పైలట్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఈ విమానం సాంకేతిక తనిఖీలు పూర్తయిన తరువాత తిరిగి బయలు దేరుతుందని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి.
[Air India Flight Emergency Landing Shamshabad Airport, Rajiv Gandhi International Airpor, Disaster Averted, Technical Lapse, Pilot Timely Action, Telugu One]


