TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఉద్యోగులపై ఏఐ ఎఫెక్ట్: ఐదేళ్లలో 2 కోట్ల 40 లక్షల ఉద్యోగాలకు ఎసరు.!

Published on: Fri Nov 27, 2026 11:45AM

కృత్రిమ మేధ ఉద్యోగులకు, ఉద్యోగాలకు భారీగా ఎసరు పెడుతోంది. వచ్చే ఐదేళ్లలో కనీసంలో కనీసం 2 కోట్ల 40 లక్షల ఉద్యోగాలకు ఏఐ ఎసరు పెడుతుందని జెపీ మెర్గాన్ వెల్లడించింది.  సంస్థలు తమ కార్యకలాపాల్లో ఏఐ ద్వారా పనులను ఆటోమేట్ చేయడం ప్రారంభించిన నేపథ్యంలో ఉద్యోగ మార్కెట్లో సంభవించే మార్పులపై ఈ జేపీ మోర్గాన్ వెల్త్ రిపోర్ట్ ఈ అంచనా వేసింది.  వ్యాపార సంస్థల పెట్టుబడులు, వ్యయాల ఆధారంగా రూపొందించిన ఒక   అంచనా ఇప్పుడు ఉద్యోగుల గుండెల్లో గుబులు నింపుతోంది. 

2030 దశాబ్దం ప్రారంభం నాటికి సంస్థల ఏఐ వ్యయం సుమారు 2.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చన్నది ఈ నివేదిక అంచనా.   ఇందులో సగం అంటే 1.2 ట్రిలియన్ డాలర్ల నిధులను ఉద్యోగుల స్థానంలో ఏఐని వినియోగించేందుకు వెచ్చించే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ చెబుతోంది. ఏఐ ఖర్చులు, తాము భర్తీ చేసే ఉద్యోగుల ఖర్చులో   సగం మేర ఉంటాయనే అంచనాతో, ఐదేళ్ల కాలంలో సుమారు 24 మిలియన్ల ఉద్యోగాల భర్తీపై దీని ప్రభావం పడొచ్చని  పేర్కొంది. 

జేపీ మోర్గాన్ అంచనా ప్రకారం,   ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులలో 1.3 శాతం మందిపై ఈ ప్రభావం పడుతుంది.  ప్రభావితమయ్యే ఉద్యోగాల్లో మూడింట రెండొంతులు అమెరికాలోనే ఉంటే, అక్కడ ఐదేళ్లలో సుమారు 16 మిలియన్ల మంది ఉద్యోగులపై, అంటే ఏటా దాదాపు 30 లక్షల మందిపై ప్రభావం పడొచ్చని నివేదిక పేర్కొంది. ఇది ఏటా పేరోల్స్‌లో సుమారు 2 శాతంగా ఉంటుందని, గతంలో తయారీ రంగంలో జరిగిన ఉద్యోగాల తగ్గుదల వేగంతో పోలిస్తే నాలుగు రెట్లు అధికం. 

ప్రస్తుతం అమెరికాలో ఏఐ సాంకేతికత సహాయంతో జరుగుతున్న పని గంటలు సుమారు 6 శాతంగానే ఉన్నాయి. అయితే దాదాపు మూడింట రెండొంతుల పనులను ఏఐ నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంది. సాంకేతిక సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థలో దీని వినియోగం క్రమంగా, అసమానంగా విస్తరిస్తున్నది. 

ఇది కూడా చదవండి:  హెచ్-1బి ఉద్యోగులకు ద్వంద్వ దెబ్బ.. అమెరికాలో ఉద్యోగ కోతలు, ఇండియాలో నియామకాల మందగమనం​

 రాబోయే కాలంలో వివిధ పరిశ్రమలు ఏఐని తమ కార్యకలాపాల్లో ఏ స్థాయిలో అనుసంధానిస్తాయనే దానిపై ఉద్యోగ నియామకాల ధోరణులు ఆధారపడి ఉంటాయి. ఉద్యోగుల నైపుణ్యాలు, పని విధానాల్లో వచ్చే మార్పులపై ఉద్యోగాల కోత ఆధారపడి ఉంటుంది.

ఏఐ ఆధారిత మార్పుల వేగం, వాటి వల్ల కలిగే ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా సంస్థలు, ఉద్యోగులు, విధాన నిర్ణేతలలో  ఏకకాలంలో ఆసక్తి, ఉత్కంఠ, ఆందోళన నెలకొని ఉంది. రానున్న సంవత్సరాల్లో ఈ సాంకేతికత ఆర్థిక వ్యవస్థ, ఉపాధి రంగాలపై ఎలాంటి మలుపులు తీసుకువస్తుదన్నది చూడాలి. 

మీకు నచ్చవచ్చు:  వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్: ఉద్యోగుల తొలగింపునకు మైక్రో సాఫ్ట్ సరికొత్త వ్యూహం.!

ఒరాకిల్ లో లేఆఫ్ లు.. టెక్ ప్రపంచంలో ప్రకంపనలు.!

[AI Effect, Employemeny, Cuts, Jobs, Fiveyears, 2crore50lacs, TeluguOne]