ఆ స్థలం అహోబిలం మఠందే

 

నెల్లూరు రూరల్ పరిధి పరిధిలోని కనుపర్తిపాడు గ్రామం 295 సర్వే నెంబర్ 1.80 ఎకరాల స్థలానికి సంబంధించి తమకు 1869 నుంచి హక్కులు ఉన్నాయని అహోబిలం మఠం కార్యదర్శి కేసి వరదరాజన్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీనికి సంబంధించి తాము ప్రతి ఏడాది  కిస్తీలు కూడా చెల్లించామన్నారు. 

2007 సంవత్సరంలో ఈ పొలం అన్యాక్రాంతమైందని తర్వాత ఆదాల కుటుంబ సభ్యుల చేతికి వెళ్లిందన్నారు. ఈ భూమి అహోబిలం పీఠం సంబంధించి నరసింహ స్వామికి చెందినది. దీనిపై మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి చుట్టూ అనేకసార్లు తిరిగినా న్యాయం చేయలేదన్నారు. రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో విచారించి పీఠానికి అన్ని హక్కులు ఉన్నాయని తేల్చారన్నారు. నరసింహ స్వామి భూమి ఆయనకే దక్కాలన్నారు.