అగస్టాపై సుప్రీం విచారణ..


 

అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాఫ్ట్ర్ కుంభకోణంలో ఇప్పటికే రాజ్యసభ.. ప్రతిపక్ష, అధికార పక్ష నేతల వాదనలతో రణరంగంగా మారింది. ఒకపక్క ముడుపులు ఎవరికి ముట్టాయో సోనియా బయటపెట్టాలని డిమాండ్ చేస్తుంటే.. పేర్లు బయటపెట్టాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదేనంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. అయితే ఇప్పుడు ఈకేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని దాఖలై న పిల్‌పై వచ్చేవారం విచారణ జరుపనున్నటు సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తులు ఆర్ భానుమతి, యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజంపై విచారణ జరుపుతున్నది. ఈ వ్యవహారంపై సత్వరమే విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎమ్మెల్ శర్మ వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ వచ్చేవారం విచారణకు లిస్టింగ్ చేయాల్సిందిగా రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.