వరంగల్ స్మశాన వాటికలో అఘోరీ వింత పూజలు
posted on Nov 19, 2024 9:00PM
మంగళగిరి జనసేన కార్యాలయం సమీపంలో నానా రచ్చచేసిన అఘోరీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత బెయిల్ పై బయటకు వచ్చిన ఆమె వరంగల్ స్మశానవాటికలో ప్రత్యక్షమైంది. శవం దగ్గర ఆమె పూజలు చేసి కోడిని బలి ఇచ్చింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన ఈ క్రతువును చూడటానికి భక్తులు స్మశానవాటికకు చేరుకుంటున్నారు. . కొన్ని రోజుల క్రితం వరంగల్ భద్రకాళీ దేవాలయంలో పూజలు చేసిన అఘోరీ మంగళవారం వరంగల్ స్మశానవాటికలో పూజలు చేస్తుంది. రాత్రి పూట స్మశానవాటికలో పూజలు చేయడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. స్మశాన వాటిక సిబ్బంది వారించినప్పటికీ అఘోరీ వినడం లేదు. శవాన్ని కాల్చిన చోట పూజలు చేసి చితాభస్మం రాసుకుంది. తాంత్రిక పూజలు చేస్తుందన్న భయంతో స్థానికులు ఆమె దగ్గరకు వెళ్లడానికి జంకుతున్నారు.