కరోనా మందులపై ఎమ్మెల్యే, DMHO వార్ 

కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తోంది. అధికారులను ఆందోళన పెడుతోంది. ప్రజా ప్రతినిధులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా కట్టడి, చికిత్స విషయంలో ప్రజాప్రతినిధులపై జనాలు ఫైరవుతున్నారు. దీంతో తమ కోపాన్ని కొందరు నేతలు అధికారులపై చూపిస్తున్నారు. నేతల తీరుతో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు తిరుగుబాటు చేస్తున్నారు. 

కరోనా మందుల విషయంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ కార్యాలయంలో కొవిడ్ సమీక్ష సమావేశం నిర్వహించగా, ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల లెక్కల్లో తేడాపై ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు విసురుకున్నారు.రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కోసం రాజకీయ పైరవీలు ఎక్కువయ్యాయని రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజెక్షన్లు ఇవ్వలేదని ఎమ్మెల్యే జోగు రామన్న తనపై కక్ష కట్టారని, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్ కు ఎక్కడ తరలిపోయాయో ఆధారాలు చూపించాలని బలరాం నాయక్ అన్నారు. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పందిస్తూ, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కోసం తాను ఎవరికీ రికమెండ్ చేయలేదని స్పష్టం చేశారు.

సమావేశం తర్వాత రిమ్స్ లో పర్యటించారు ఎమ్మెల్యే జోగు రామన్న.  హాస్పిటల్ లో కోవిడ్ మందులు, చికిత్స పై ఆరా తీశారు. కరోనా రోగులతోనూ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News