పైసలొద్దు చెప్పులే కావాలంటున్న భామ
posted on Oct 9, 2013 12:21PM

అందం, అభినయంతో అభిమానుల గుండెల్ని కొల్లగొట్టిన హీరోయిన్ రమ్య ఇటీవలే లోక్‌సభ సభ్యురాలుగా గెలుపొందిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ అమ్మడు తనకున్న గ్లామర్ ఇమేజ్ ను తన ప్రజలకు సేవా కార్యక్రమాలకు ఉపయోగపడేలా కొత్తగా ఆలోచిస్తుంది. అయితే ఇటీవలే ఈ అమ్మడిని ఒక పాపులర్ చెప్పుల కంపెనీ తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని కోరారంట. అయితే రమ్య మాత్రం తనకు రెమ్యునరేషన్ కాకుండా ఒక లక్ష జతల చెప్పులను ఇస్తే చాలని చెప్పిందట. దానికి కనీసం 50 వేల జతల చెప్పులు ఇచ్చేందుకు ఆ కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. ఇంతకీ ఆ చెప్పులు ఎందుకని అనుకుంటున్నారా...? తన నియోజకవర్గ ప్రజలకు ఏదైనా సహాయం చేయాలనే ఆశతో....తన నియోజకవర్గంలోని మున్సిపల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆ చెప్పులను అందజేయాలని అనుకుందట. మొత్తానికి ఈ విధంగానైనా తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని దక్కించుకుంది.