నటి అంజలికి బలుపా ?
posted on Jul 3, 2013 9:27AM

హీరోయిన్ అంజలి వివాదం కొనసాగుతూనే ఉంది. అంజలిపై ఇప్పుడు రెండు కేసులు ఉన్నాయి. ఒకటి ఆమె పిన్ని పెట్టింది, రెండోది తమిళ దర్శకుడు పెట్టింది. ఇప్పటి వరకూ వీటి విచారణ విషయమై అంజలికి మూడు సార్లు చెన్నై కోర్ట్ నుంచి పిలుపు వచ్చింది. మూడుసార్లూ అంజలి కోర్ట్ కు గైర్హాజరైంది. దీంతో ఈ సారి మరింత సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది కోర్టు. ఈ నెల 9లోగా కోర్టుకు హాజరు కాకుండా తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఇది అంజలిలోని నిర్లక్ష్యాన్ని చాటుతోంది. మరి కోర్టులు ఎన్ని రోజులు అంజలిని ఇలాగే క్షమిస్తాయి? అనేది కూడా ఆసక్తికరమైన అంశమే! ఇప్పుడు అంజలి తప్పు చేసిందా లేదా అనేది పాయింటు కాదు కానీ.. ఈమె కోర్టుకు హాజరు కాకపోవడమే ఇష్యూ అవుతోంది. తప్పు చేయని వారు దేనికీ భయపడనక్కర్లేదు.. మరి అంజలి కోర్టుకు రావడానికి ఎందుకు భయపడుతోంది? అంజలిది భయమా, బలుపా?