అంజలి మిస్సింగ్ పై స్టేషన్‌లో ఫిర్యాదు
posted on Apr 9, 2013 6:16PM

సినీ నటి అంజలి సోదరుడు రవిశంకర్ తన చెల్లి అదృశ్యమైందని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం నుండి ఆమె కనిపించడం లేదని, ఆమె ఫోన్ కూడా పనిచేయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్ నుంచి ఆమె అదృశ్యమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియమ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని అంజలి ఆరోపించి అదృశ్యమవడం సినిమా పరిశ్రమంలో కలకలం రేపింది.
మరోవైపు తనపై సినీ నటి అంజలి చేసిన ఆరోపణలను ఖండించిన దర్శకుడు కళంజియమ్ ఖండించారు. కుట్ర పూరితంగా తనను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంజలి ఆరోపణలపై చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశానని చెప్పారు. తనకు పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియంల నుండి ప్రాణాలకు ముప్పు ఉందని అంజలి ప్రకటించిన నేపథ్యంలో ఆమె మాటలతో తన పరువుకు నష్టం కలిగిందని కళంజియం అంటున్నారు.