హీరోయిన్ అంజలిని వేదిస్తున్న పిన్ని
posted on Apr 9, 2013 11:19AM

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తో తెలుగు లో క్రేజ్ ని తెచ్చుకున్న హీరోయిన్ అంజలి చిత్ర హింసలు పెడుతున్నారట. అంజలి పిన్ని భారతీదేవి తనను వేదిస్తోందని ఆరోపించింది. '' నా వెంటే ఉంటూ నాకు గోతులు తవ్వారని, ఇప్పుడు నా వద్ద చిల్లిగవ్వ లేకుండా నా ఆస్తి అంతా మింగేశారని, ఇప్పుడు చిత్ర హింసలు పెడుతున్నారని” వాపోయింది అంజలి.
నా సొంత అక్క, అన్నలతో కూడా మాట్లాడనీయకుండా చిత్రహింసలు పెడుతున్నారని, నా ప్రాణాలకు వీరి నుండి ముప్పు ఉందని, ఏం జరిగినా వీరిదే భాధ్యత అని తేల్చిచెప్పింది. వీరితో పాటు దర్శకడు కలంజియం కూడా నన్ను మోసం చేశారని, నేను మేజర్ ను అయ్యాను కాబట్టి వీరికి దూరంగా ఉండాలని హైదరాబాద్ లో ఉంటున్నానని తెలిపింది. ప్రస్తుతం అంజలి తెలుగులో రవి తేజ సరసన బలుపులో నటిస్తుంది.