స్వగృహానికి ఉదయ్ కిరణ్ మృతదేహా౦

 

 

 

హీరో ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని సందర్శించేందుకు సోదరి, బావ మస్కట్ నుంచి నిమ్స్‌కు చేరుకున్నారు. అనంతరం ఆయన మృతదేహాన్ని శ్రీనగర్ కాలనీలోని స్వగృహానికి తరలించారు. అభిమానుల సందర్శనార్ధం ఆయన శరీరాన్ని ఫిల్మ్ చాంబర్ లో రేపు ఉదయం 10 గంటల నుంచి 11గంటల వరకు ఉంచుతారు. నగరంలోని ఎర్రగడ్డ స్మశానవాటికలో మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయి.

 

మరోవైపు ఉదయ్ కిరణ్ తన కళ్ళను దానం చేశాడు. తన కళ్లను దానం చేయాలన్నది అతని కోరిక కావడంతో కుటుంబ సభ్యులు ఆ బాధ్యత నెరవేర్చారు.  ఉదయ్ కిరణ్ నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి దానం చేశారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు ఉదయ్ కిరణ్ నేత్రాలలోని రెటీనాను సేకరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu