రజనీ వియ్యంకుడిపై పోలీస్ కేసు
posted on Nov 26, 2012 10:01AM

సూపర్ స్టార్ రజనీకాంత్ వియ్యంకుడు, తమిళ హీరో ధనుష్ తండ్రి అయిన కస్తూరి రాజాపై పోలీస్ కేసు నమోదయ్యింది. గతంలో ఓ ఫైనాన్సర్ కి చెల్లని చెక్కిచ్చిన నేరంపై కస్తూరిపై కేసు నమోదయ్యింది. చాలారోజులపాటు రావాల్సిన డబ్బుకోసం ప్రయత్నం చేసిన ఫైనాన్సియర్ చివరికి నేరుగా పోలీస్ కేసు పెట్టేసినట్టు తెలుస్తోంది.
ధనుష్ తోపాటు దర్శకుడు సెల్వరాఘవన్ కీ తండ్రి అయిన కస్తూరి రాజా గతంలో తమిళ సినీరంగంలో సార్ డైరెక్టర్ గా చెలామణీ అయ్యారు. రజనీ – కస్తూరి రాజాల హిట్ సినిమా “ ఎన్ రాసావిన్ మనసిలే” తెలుగులో మొరటోడు నా మొగుడు పేరుతో రీమేక్ కూడా అయ్యింది.
ప్రస్తుతం కస్తూరి రాజా చెక్ బౌన్స్ వివాదం అటు పెద్దకొడుగు ధనుష్, తన మామగారు రజనీల పైన, ఇటు చిన్నకొడుకు సెల్వరాఘవన్ పైన పడుతుందని తమిళ సినీవర్గాల్లో తారా స్థాయి గుసగుసలు వినిపిస్తున్నాయ్. పోయిన సినిమాలక్కూడా బయ్యర్లకు పిలిచి డబ్బులిచ్చేసే అలవాటు, మంచి పేరు ఉన్న రజనీకాంత్ ఈ వివాదాన్ని ఎలా చూస్తారోనన్న ఉత్కంఠకూడా చాలా మందికి కలుగుతోంది.