కేజ్రివాల్ పై 'ఆమ్ ఆద్మీ' ఎమ్మెల్యే ఫైర్..డెడ్ లైన్

 

 

 

ఏడాది కాలంలోనే అధికారం అందిపుచ్చుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పరిపాలన మీద ఆయన సొంత పార్టీలోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేజ్రివాల్ చేసిన వాగ్దానాలను అమలు చేయటం లేదంటూ లక్ష్మీనగర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ విరుచుకుపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్ధానాలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఆయన ఈ రోజు విమర్శించారు. ఆప్ పాలన మరో దిశలో సాగుతుందని, చేస్తున్న దానికి ..చెబుతున్న దానికి ఏ మాత్రం పొంతన లేదని అన్నారు.

 

తాజాగా ఎన్నికల చేసిన వాగ్గానాలను నెరవేర్చడానికి బిన్నీ డెడ్ లైన్ విదించారు. ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే తాను జనవరి 27 తేది నుంచి నిరవధిక దీక్ష చేపడుతానని బిన్నీ హెచ్చరించారు. ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలను తుంగలో తొక్కుతున్నారని పార్టీ నేతలపై, ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన కేజ్రివాల్ ఆ రెండు పార్టీలకు  ఎలా భిన్నమో ప్రజలు తెలుపాల్సిన అవసరం ఉందన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu