వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు 

కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసు కేసు నమోదయింది. ఈ విషయాన్ని స్థానిక ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. ఎస్సై చెప్పిన వివరాల ప్రకారం కొత్తూరులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో... నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని... ఆయనపై కేసు నమోదు చేయాలని ఎంపీడీవో సాయిలహరి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 

నువ్వెంతా.. నీ బతుకెంతా.. ఒక్క రోజు ఉంటావో రెండు రోజులు ఉంటావో.. ఎక్కడి నుంచి వచ్చావ్.. ఎవరి ప్రభుత్వం అనుకుంటున్నావ్... ఇవన్నీ ఎవరో సామాన్యులు తిట్టుకునే తిట్లు కావు. కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి బహిరంగ సభలో చేసిన విమర్శలు. తానొక ప్రజాప్రతినిధిననే విషయం మరిచి రెచ్చిపోతున్న వైనం.. ఇది ఏపీలో పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది. వైసీపీ శ్రేణుల్లోనూ ఆయన తీరుపై అసహనం వ్యక్తమవుతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu