ఆగని శానిటైజర్ మరణాలు.. తాజాగా వైఎస్సాఆర్ కడప జిల్లాలో...

ఏపీలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నసంగతి తెలిసిందే. తాజాగా నిన్న ఒక్క రోజు 67 మంది కరోనా బారిన పది మృత్యు వాత పడ్డారు. తాజాగా దీనికి తోడు మధ్యమ దొరకక మత్తు కోసం శానిటైజర్ తాగిన వారి మరణాలు కలకం రేపుతున్నాయి. మొన్న ప్రకాశం జిల్లా కురిచేడులో జరిగిన ఘటనను మరవక ముందే కడపలో మరో ఘోరం చోటు చేసుంకుంది. వైఎస్సాఆర్ కడప జిల్లాలో పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగి ముగ్గురు మరణించారు. వారిని ఓబులేశు, భీమయ్య, చెన్నకేశవులుగా గుర్తించారు. ఐతే వీరు శానిటైజర్ తాగిన విషయాన్ని కుటుంబ సభ్యులు దాచి పెట్టడమే కాకుండా చివరకు వారు మరణించిన విషయాన్ని కూడా బయట పెట్టలేదు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా చేశారు. కురిచేడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో పోలీసుల కేసులకు భయపడి వారు ఈ విషయం బయటకు రానీయలేదని తెలుస్తోంది.

ఐతే వారు అనారోగ్యంతో చనిపోయారని చెప్పి రహస్యంగా అంత్యక్రియలు చేసినప్పటికీ ఆ నోటా ఈ నోటా పడి విషయం పోలీసుల వరకు వెళ్లింది. తాజగా ఇదే గ్రామంలో మరో 10 మంది శానిటైజర్ తాగినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ఘటనపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అంటే కాకుండా పోలీసులు గ్రామానికి వెల్లి పూర్తీ వివరాలు సేకరిస్తున్నారు. శానిటైజర్ తాగిన వారు తమంతట తాము బయటకు వస్తే వారికీ మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని పోలీసులు చెప్పారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్లు తాగడంతో 15 మంది మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా రెక్కాడితే కానీ డొక్కాడని పేద కూలీలే కావడం మరో విషాదం.