మహేష్ '1నేనొక్కడినే' హైదరాబాద్ ధియేటర్స్
posted on Jan 6, 2014 10:43AM

ప్రిన్స్ మహేష్ '1నేనొక్కడినే' సంక్రాంతి కానుకగా జనవరి 10న భారీగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో మొదటిరోజు రికార్డ్ లెవల్లో షోలు ప్రదర్శించనున్నారని సమాచారం. ఈ సినిమా తన కెరీర్లో ఇదొక ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని మహేష్ బాబు స్వయంగా వెల్లడించారు. ఇందులో క్రితి సానన్ జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో నాజర్, అను హుస్సేన్, షాయాజీ షిండే, ప్రదీప్ రావత్, కెల్లీ దోర్జీ, విక్రమ్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ డైలాగులు, మహేష్ బాబు పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ కానున్నాయి.
'1నేనొక్కడినే' హైదరాబాద్ ధియేటర్స్ లిస్ట్:
