టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ 

వైసీపీలో మార్పులు చేర్పులు  నేపథ్యంలో మైలవరం టికెట్ తనకు దక్కకపోవచ్చని  వైసీపీ ఎమ్మెల్యే కృ ష్ణ ప్రసాద్ డిసైడ్ అయిపోయారు.ఒకటి రెండు రోజుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.  మైలవరం టికెట్ అడ్డుకోవడానికి జోగి రమేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన  బాహాటంగానే విమర్శలు చేశారు. . దీంతో గత నెల కృష్ణ ప్రసాద్ కు రాజమహేంద్రవరం ప్యాలెస్ నుంచి ఫోన్ రావడంతో  ఆయన ముఖ్యమంత్రి జగన్ ను కలిసారు. వీరిరువురి సయోధ్యకు జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు  తాను పోటీ చేయబోనని కృష్ణ ప్రసాద్ ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో  వైసీపీ ప్రకటించిన జాబితాలో మైలవరం  పేరు లేకపోవడం గమనార్హం. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కృష్ణ ప్రసాద్ ను జోగి రమేష్ ఇబ్బందులు గురి చేస్తున్నట్లు సమాచారం.ఆయన  టీడీపీలో చేరేందుకు దాదాపు సిద్ధమయ్యారు. ఈ నెల 8 తరువాత ఆయన పార్టీ మారే అవకాశం ఉంది.  ముఖ్యమంత్రి జగన్    గన్  నిర్వహిస్తున్న     సిద్ధం సభకు తాను హాజరుకాబోనని కూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. 
తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేశ్ జోక్యం చేసుకుంటున్నారంటూ వసంత కృష్ణ ప్రసాద్ గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సీఎం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. 
మాజీమంత్రి, కృష్ణా జిల్లా  వైసీపీ అధ్యక్షులు కొలుసు పార్థ సారథి వైసీపీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. మైలవరం నియోజకవర్గం కూ డా కృష్ణా జిల్లాలో ఉంది. పార్థ సారథి ప్రోద్బలంతో కృష్ణ ప్రసాద్ టిడిపి తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమయ్యారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  వసంత కృష్ణప్రసాద్ ఇప్పటికే రెండు సార్లు నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ  జడ్పీటీసీ తిరుపతి రావు యాదవ్‌ను ఇంచార్జ్‌గా ప్రకటించింది. ఇదిలా ఉంటే, నియోజకవర్గంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. పనులు చేసిన పార్టీ నేతలు ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైలవరం ఎమ్మెల్యే వైసీపీని వీడటం ఖాయమని తేలిపోవడంతో అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది.  టిడిపిలోకి వలసలు పెరగడంతో వైసీపీ ఇల్లు ఖాళీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News